Thursday, 5 November 2026

దేవరకొండ తాపీ మేస్త్రీల సంఘం అధ్యక్షుడిగా శిరమోని రాములు యాదవ్

దేవరకొండ తాపీ మేస్త్రీల సంఘం అధ్యక్షుడిగా శిరమోని రాములు యాదవ్ కొండమల్లేపల్లి డిసెంబర్ 15 జనం సాక్షి న్యూస్: గురువారం దేవరకొండ పట్టణంలోని కోదండ రామాలయం ఆవరణలో జరిగిన తాపీ మేస్త్రీల సంఘం అధ్యక్ష పదవి ఎన్నికల్లో తాపీ మేస్త్రీల అందరూ హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అనంతరం జరిగిన ఎన్నికలలో ఆయన తమ సమీప అభ్యర్థి జింకల మధు పై 58ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తనకు ఓట్లు వేసి తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్క తాపీ మేస్తిరికి నూతన అధ్యక్షుడు రాములు యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాపీ మేస్త్రీల సమస్యల పట్ల పోరాటం చేస్తానని, తాపీ మేస్త్రీల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాపీ మేస్త్రి సంఘం సభ్యులు గంట యాదయ్య, చిత్రం వాసు, జింకల పర్వతాలు, కొమ్మనమోని వెంకటేష్ యాదవ్, వెంకటయ్య, పంగ శ్రీను, కొండూరు మల్లయ్య, కొమ్మనమో ని శివయాదవ్, పొట్ట శేఖర్, లింగం, కొండల్, సవారి తదితరులు పాల్గొన్నారు