దేవాలయములో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే.
మల్కాజిగిరి.జనంసాక్షి.ఆగస్టు 30
దేవాలయ అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే మైనాంపల్లి హనుమంతరావు అన్నారు.
మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని శివపురి కాలని లోని శివాలయంలో వెంకటేశ్వర స్వామికళ్యాణం సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు.ఆలయ కమిటీ సభ్యులు ఆయను శాలువాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.అనంతరం
గుడి మెట్ల మార్గం నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్ కుమార్,సతిష్ కుమార్,
రామూయాదవ్,సంతోష్ రాందాస్,ఆలయ కమిటీ సభ్యులు మూర్తి,సోమా శ్రీనివాస్,మోహన్ రెడ్డి,లోకేష్,మల్లికార్జున్,రామ్ శర్మ,సుబ్రమణ్యం,తదితరులు పాల్గొన్నారు