Wednesday, 4 November 2026

దేవాలయ అభివృద్ధికి గ్రామ ప్రజలంతా కృషి చేయాలి

 

 

 

 

 

 

హుజూర్ నగర్ ఏప్రిల్ 6 (జనంసాక్షి): దేవాలయ అభివృద్ధికి గ్రామ ప్రజలందరూ కృషి చేయాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మండల పరిధిలోని లింగగిరి గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా గురువారం స్థానిక ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం దేవాలయాలకు, ప్రార్థన స్థలాల అభివృద్ధికి, ఎంతో కృషి చేస్తున్నారనీ అన్నారు. నాలుగు సంవత్సరాలలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధిస్తూన్నని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆశయాలను ప్రభుత్వం నెరవేరుతుందని అన్నారు. దేవాలయ ప్రాంగణంలో దేవదాయ శాఖ పరిశీలకులు ఈ.రమేష్ నూతన పాలకమండలి సభ్యులైన ఉద్దోజు భిక్షమాచారి, కవిత, లక్ష్మయ్య, అంజయ్య, అర్చకులు దామోదరా చార్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ కార్యనిర్వహణాధికారి గుజ్జుల కొండారెడ్డి, జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ కర్నాటి అంజిరెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ గోపాల్ రావు, ఎంపీటీసీ విజయలక్ష్మి, లక్ష్మణరావు, అబ్దుల్ నబి, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.