Wednesday, 4 November 2026

స్కాంలు,పేపర్ లీకేజీల పోటీలో బి జె పి, బి ఆర్ ఎస్ ప్రభుత్వాలు బిజీ బిజీ  –  మాజీమంత్రి

 

 

 

 

పెనుబల్లి, ఎప్రిల్6(జనం సాక్షి)  స్కాంలు,  పేపర్ లీకేజీ ల తొ బిఆర్ఎస్, బిజెపి పార్టీలు బిజి బిజి గా ఉంటూ విద్యార్థుల, నిరుద్యోగుల భవిష్యత్ తో ఆటలాడుతు న్నాయని ఏఐసిసి సభ్యులు, టి పి సి సి సీనియర్ ఉపాధ్యక్షులు సం బాని చంద్రశేఖర్ అన్నారు,సత్తుపల్లినియోజకవర్గంలో 29వ రోజు హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా గురువారం పెనుబల్లి మండలం నాయకుల అగ్రహారం, కొండ్రుపాడు, గణేష్ పాడు, ముత్తగూడెం గ్రామాలలో  సంభాని చంద్రశేఖర్  కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ఇంటి ఇంటికి ప్రచారంలో కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ది సాధ్యమని తెలుపుతూ రాహుల్ గాంధీ  సందేశ పత్రముతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై రూపొందించిన చార్జిషీట్ ని ప్రజలకు అందజేశారు,ఈ సందర్భంగా సంభాని చంద్రశేఖర్ మాట్లాడుతూ  బి జె పి, బి ఆర్ ఎస్ పార్టీలు చేతగాని పాలనతో   స్కాములు, పేపర్ లీకులతో పోటీపడి అటు దేశాన్ని, ఇటు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు,   మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారాన్ని దక్కించుకొని ప్రజల సంక్షేమాన్ని తుంగలో తొ క్కారని విమర్శించారు, ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఆశలు చూపి ప్రభుత్వ అసమర్థత వలన పేపర్ లీకులతో  నోటిఫికేషన్లు రద్దుచేసి వారి జీవితాలను చీకటిమయం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో పరీక్షా పేపర్ల లీకుల పరంపర కొనసాగుతోందని బి జె పి, బి ఆర్ ఎస్  పార్టీలు చిన్నపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాయని అన్నారు,అసమర్థపాలనతో  వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ దేశాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు,హస్తానికి 5వేళ్లు లాగా హస్తం  అధికారంలోకి రాగానే ప్రజలకు 5మేళ్లు_ఏకకాలంలో చేస్తానని  రైతు రుణమాఫీ 2 లక్షలు,ఆడబిడ్డలకు రూ. 500కి గ్యాస్ సిలిండర్,ఇందిరమ్మ ఇంటికి 5 లక్షల సాయం,ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే కనీస పెన్షన్ 5000.మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాల భర్తీ వంటి అనేక సంక్షేమ పథకాలను హస్తం పార్టీ చేస్తుందని అన్నారు. పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెలికాని రాజబాబుఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు బైరెడ్డి మనోహర్ రెడ్డి, స్టేట్ ఎస్ సి.డి పి టి. కన్వీనర్ కొండూరు కిరణ్, పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వడ్లమూడి కృష్ణయ్య, గరిమెళ్ళ సత్యనారాయణ, మాచినేని మోహనరావు, తెళ్ళురి శ్రీను, కర్నే గోవర్ధన్ రావు, కొమ్మినేని తిరుపతిరావు, కాకా వెంకటేశ్వర్లు, దేవేంద్ర బాబు, భోగి నరసింహారావు, పకీర్ సాహెబ్, బెల్లంకొండ సీతారాములు, బల్లి కాసులు, కండే వెంకటేశ్వరరావు, కంచర్ల పుల్లయ్య, నక్కంటి కృష్ణ, యార్లగడ్డ లింగయ్య, గంగాధర నరసింహ రావు,  నాగరాజు, తుంగా సత్యం, రెగళ్ళ కృష్ణ, జక్కంపూడి సురేష్, నరేంద్ర, నారాయణస్వామి తది తరులు పాల్గోన్నారు.