దేవుళ్లకు కరోనా ఎఫెక్టు..

షిర్డీ సాయిబాబా ఆలయం మూసివేత

హైదరాబాద్,మార్చి 17(జనంసాక్షి):కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు ఆల యాలకు కూడా దాపురించింది. కరోనాతో మహారాష్ట్రలోని ప్రఖ్యాత షిర్డీ ఆల యాన్ని మూసివేయనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆల యాన్ని మూసివేయనున్నట్లు శ్రీ సాయిబాబా సంస్థాన్ 66 సంస్థలపై హైదరాబాద్కరోనా వ్యాప్తి దృష్ట్యా నగరంలో విభాగం తనిఖీలు నిర్వహించింది.

– భద్రాది శ్రీరామ కళ్యాణోత్సవంపై వైరస్ ప్రభావం ట్రస్ట్ ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఆలయాన్ని ట్రస్ట్ అధికారులు మూసివేయనున్నారు. భక్తులు షిర్డీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే ముంబయిలోని సిద్ధి వినాయక ఆలయాన్ని మూసివేశారు. ఆగ్రాలోని తాజ్ మహల్ ను కూడా మూసేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల ఆలయంలో శ్రీవారిని టైంస్లాట్ టోకెన్ ద్వారా తక్కువ సమయంలో దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మహారాష్ట్రలో కరోనా .వైరస్లో 68 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య మూడుకు రోజుల చేరింది. ఒక్క మహారాష్ట్రలోనే అత్యధికంగా కరోనా కేసులు 36 నమోదు అయ్యాయి. ఇప్పటికే సీఎం ఉద్దవ్ థాకరే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. రద్దీ ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. సినిమా హాల్స్, షాపింగ్ మాలను మూసివేశారు. అన్ని ఎన్నికలను కూడా వాయిదా వేశారు. ఇకపోతే కరోనా వైరస్ సోకిన కేసులు మహారాష్ట్రలో అత్యధికంగా నమోదు అయ్యాయి. దాదాపు ఇక్కడ 39 కేసులు నమోదు అయినట్లు బాధితురాలి అధికారులు వెల్లడించారు. అంతేకాదు ప్రధాన నగరమైన నాగపూర్ లో 144 సెక్షన్ విధించారు. కరోనాపై సీఎం ఉద్దవ్ థాకరే మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏ ఒక్క పట్టణాన్ని నిర్బంధంలో ఉంచలేమని అన్నారు. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. దేవాలయాలు, చర్చిలకు గుంపులుగా వెళ్లవద్దని సూచించారు. రానున్న 15 నుంచి ఇరవై రోజులు ఎంతో కీలకమని నాగపూర్ నగర పోలీసు కమిషనర్ రవీంద్ర కందం కోరారు. ఇదిలావుండగా రాష్ట్రంలో అన్నిరకాల పరీక్షలను వాయిదా వేశారు. పోలీసులు రామయ్య కళ్యాణోత్సవంపై వైరస్ ప్రభావం భద్రాచల రామయ్యకు కూడా కరోనా కష్టాలు తప్పడం లేదు. అంగరంగ వైభవంగా ఆయన పెళ్ళి వేడుకులు నిర్వహించాలనుకున్నా కరోనా మహమ్మారి అడ్డం పడుతోంది. దీంతో సాదాసీదాగానే ఈ యేడు కళ్యాణం జరిపించాలని నిర్ణయించారు. భద్రాద్రి సీతారాముల కల్యాణానికి యేటా దేశ వ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు. ముందుగానే కల్యాణం టికెట్లు బుకింగ్ జరుగుతుంటుంది. రామయ్య కల్యాణాన్ని ఎన్నో ఏళ్లుగా ఆరుబయట.. ప్రతి ఒక్కరూ తిలకించేలా నిర్వహిస్తున్నారు. కానీ ఈసారి రామయ్య కల్యాణాన్ని తిలకించే అదృష్టం భక్తులకు దక్కదు. కారణం కరోనా మహమ్మారి. కరోనా వ్యాప్తి కారణంగా స్వామివారి కల్యాణానికి ఎవరినీ అనుమతించట్లేదని.. కాబట్టి భక్తులెవరూ రావొద్దని జిల్లాకు చెందిన రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. కేవలం అర్చకులు మాత్రమే శాస్తోక్తంగా కల్యాణ క్రతువును నిర్వహించనున్నారు. రామయ్య కల్యాణం భాధ్యతలను ఈసారి ప్రభుత్వ సలహాదారు రమణాచారికి అప్పగించారు. రామయ్య కల్యాణ మహోత్సవం లో భాగంగా ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరుఫున తీసుకుని వచ్చే పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఈసారి ఎవరు తీసుకు వస్తారనే దానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కల్యాణం టిక్కెట్ల అమ్మకాలను పూర్తిగా నిలిపివేశారు. ఇప్పటికే కొన్నవారికి డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. నిజానికి రాముడు నడియాడిన వేద భూమి భద్రాచల క్షేత్రం. శ్రీసీతారామ చంద్ర స్వామివారు సతీసమేతంగా నడిచిన పుణ్యధామం బ్రహ్మోత్సవాలకు ముస్తాబు చేశారు. పుణ్యక్షేత్రంలో ఎక్కడ చూసినా రామయ్య పెళ్లి పనులే కొనసాగాయి. ఈ నెల 25 నుంచి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారరంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఏప్రిల్ 2న శ్రీసీతారాముల కల్యాణం, ఏప్రిల్ 3న శ్రీ రామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ వేడుకల విజయవంతం కోసం అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. అయితే అంతలోనే కరోనా కలకలంతో మంత్రి పువ్వాడ కీలక ప్రకటన చేశారు. పూజారులు కూడా అదే వైఖరిని వెల్లడించారు. రాములోరి కల్యాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయ నుకుంటుండగా సాదాసీదాగా కళ్యాణోత్సవానికి తెరతీసారు. దేవస్థానం ఇప్పటికే వైదికపరమైన ఏర్పాట్లను చేస్తోంది. తలంబ్రాలు కలుపు పక్రియ ప్రారంభం కావడంతో ఇక ఇతరత్ర పనులపై దేవస్థానం అధికారులు దృష్టి సారించారు. తలంబ్రాలు, ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. కల్యాణం, శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించే మిథిలా ప్రాంగణాన్ని ముస్తాబు చేస్తున్నారు. సెక్టార్ల వారీగా పనులు నిర్వహిస్తున్నారు. కల్యాణ మండపానికి, స్టేడియం చుట్టూ రంగులు వేశారు. రామాలయం పరిసరాల్లో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. పట్టణ పురవీధుల్లో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. పంచ రంగులతో ఆర్చీ గేట్లను సిద్ధం చేశారు. ఆహ్వాన పత్రికలను కూడా సిద్ధం చేస్తున్నారు. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు ఆహ్వాన పత్రికలను అందజేయనున్న తరుణంలో ఉత్సవాలను పరిమితం చేయాలని నిర్ణయించారు. పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించి కళ్యాణోత్సవ వేడుకలను మమ అనిపించబోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని మంత్రి వెల్లడించారు. శ్రీసీతారాముల కల్యాణం, శ్రీరామ పట్టాభిషేకం వేడుకలకు దేశ వ్యాప్తంగా భారీగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో ముందుగానే ప్రకటన చేయడం ద్వారా భక్తులు రాకుండా చూస్తున్నారు. వెళ్లవనర్ రవీంద్ర కులంపై వైరస్ ప్రభాకష్టాలు తప్పడం అడ్డం పడుతో రామయ్య కళ్యాణ స్వామివారి కల్యాణానికి డ అజయ్ కుమా దరం భీకం నిర్వహించనుంతలోనే కరోనా కల.. రాములో

తాజావార్తలు