(జహీరాబాద్ జనం సాక్షి),ప్రజల శ్రేయస్సే తనకు ముఖ్యమని వారి అభ్యున్నతికే పనిచేస్తా అన్నారు ప్రజా నాయకుడు జంగం గోపి అన్నారు. శుక్రవారం జహీరాబాద్ పట్టణంలోని రంజోల్ ల్లో ప్రారంభించిన తన నూతన కార్యాలయంలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు ఆయన నాకు ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం కలిపిస్తే భారతదేశంలోనే నెంబర్ వన్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకునే లాగ పనిచేస్తానన్నారు, నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే జహీరాబాద్ నియోజకవర్గన్ని హైదరాబాద్ నగరం తలపించేలా అభివృద్ధి చేసి చూపిస్తా అన్నారు. మాటలు కావని చేతలతో అభివృద్ధి చేసి దేశంలో రోల్డ్ మాడల్ గా నిలుస్తానని అన్నారు.




