Tuesday, 3 November 2026

దేశంలోనే హైదరాబాద్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన మెట్రో

దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందిన మెట్రో హైదరాబాద్ మెట్రో అన్నారు మంత్రి కేటీఆర్‌. గురువారం శాసనసభలో ప్రశ్నోత్తరాలు సమయంలో మెట్రోపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.

చెన్నైలో ఐదు సంవత్సరాలు అయింది మెట్రో ప్రారంభించి.. ఈరోజుకి చెన్నై మెట్రోలు ప్రతిరోజు 75 వేల మంది మాత్రమే ప్రయాణిస్తున్నారు. అదే హైదరాబాద్‌ మెట్రోలో రోజుకు 3 లక్షల మంది ప్రయాణిస్తున్నారని తెలిపారు. టీఎస్‌ ఆర్టీసీ ఏసీ బస్సుల కంటే మెట్రో ఛార్జీలే తక్కువని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో మెట్రోరైలు ప్రాజెక్టుపై 370 కేసులున్నాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చినంక సీఎ కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుని రెండేళ్లలోనే 360 కేసులు పరిష్కరించారు. ఓల్డ్‌సిటీకి ఖచ్చితంగా మెట్రోరైలు వస్తుందని స్పష్టం చేశారు. మెట్రో రైలు ప్రాజెక్టుపై అపోహలు సృష్టించడం మానుకోవాలి. హైదరాబాద్ మెట్రోకు 80 గ్లోబల్ అవార్డులు వచ్చాయి. గతంలో గన్‌పార్క్‌ను పడగొడుతూ మెట్రోరైలు ప్రాజెక్టు డిజైన్ చేశారు. అమరవీరుల స్థూపానికి నష్టం జరగకుండా మెట్రోమార్గాన్ని తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసిందని తెలిపారు.