Wednesday, 4 November 2026

దేశంలో ఆర్ధిక స్వేచ్చ న్యూ ఇండియా పార్టీ సిద్దాంతాలతోనే సాధ్యం. – తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ జనగామ తిరుపతి.

 

 

 

 

బెల్లంపల్లి, మే 6, (జనంసాక్షి )న్యూ ఇండియా పార్టీ చేస్తున్న ఆర్థిక స్వేచ్ఛ విజయ సంకల్పయాత్ర శనివారం బెల్లంపల్లి పట్టణానికి చేరుకుంది. బెల్లంపల్లి మార్కెట్ దగ్గర ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వీధులలో తిరుగుతు ఆర్ధిక స్వేచ్చ పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో న్యూ ఇండియా పార్టీ అధ్యక్షులు డా. జే వి రాజుబాయ్ పటేల్, ఉపాధ్యక్షులు వేముల అశోక్, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ జనగామ తిరుపతి మాట్లాడుతు న్యూ ఇండియా పార్టీ ప్రధానమైన నాలుగు పథకాల తో రాష్ట్రంలో దేశంలో ప్రతి ప్రజకు దేశఫలలాలు అందుతాయి అని తద్వారా పేదరికం లేని భారతదేశం నిర్మించవచ్చు అని అన్నారు. ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి నెలకు అయిదు వేల రూపాయలు అందించడం, ప్రతి కుటుంబానికి పన్నెండు లక్షలు ఇచ్చి వారిని వ్యాపారవేత్తలుగా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం, ప్రతి గ్రామానికి ఏటా ఐదు కోట్లు కేటాయించి, ఆ గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించడం, పారిశ్రామికంగా ఎదిగించడం కోసం పరిశ్రమలను స్థాపించి ప్రతి ఒక్కరిని ఉద్యోగులుగా మార్చి, వారిలో పనితత్వాన్ని పెంచి, ఆ గ్రామాన్ని పారిశ్రామిక గ్రామంగా మార్చడం, ఎకరాకి సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తూ అయిదు ఎకరాలకు తక్కువగా ఉన్న ప్రతి కుటుంబానికి సంవత్సరానికి అరవై వేలు ఇవ్వడం లాంటి న్యూ ఇండియా పార్టీ విధానాల ద్వారా వ్యక్తికి, కుటుంబానికి, గ్రామానికి మరియు దేశానికి ఆర్థిక స్వేచ్ఛ స్వాతంత్ర్యం సిద్ధిస్తాయి అని తెలిపారు.
ఇప్పటివరకు ఏలిన పాలకులు ప్రజలకి ఆర్థిక స్వేచ్ఛ అందించకుండా కల్లబొల్లి పథకాలతో ప్రజల్ని విభజించి పాలించడం తప్ప ప్రజలను బ్రతికిస్తూ ఎదిగించి ఆర్థిక స్వేచ్ఛతో పాలించినటువంటి దాఖలు లేవు అని ఎద్దేవా చేశారు. ప్రతి ఒక్కరికి ఆర్థిక ఫలాలు అందించే విధంగా జవాబుదారితనంతో పాలించడం కోసం న్యూ ఇండియా పార్టీ ప్రజల ముందుకు వచ్చింది అని అన్నారు. పార్టీ సిద్ధాంతాల్ని పరిశీలించి రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని న్యూ ఇండియా పార్టీ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటేనే ప్రజలకి ఆర్థిక ఫలాలు అంది వారి భవిష్యత్తు బంగారు బాటగా పయనిస్తుందని ప్రతి ఒక్కరు బ్రతుకుతూ ఎదిగే పద్దతి ఏర్పడుతుందని తెలియజేయడం కోసం ఊరూరా గడపగడప ఆర్థిక స్వేచ్ఛ విజయ సంకల్పయాత్ర చేస్తుంది అని అన్నారు. ఇట్టి యాత్రలో అందరు పాల్గొని న్యూ ఇండియా పార్టీ విధివిధానాలను అర్థం చేసుకొని ప్రజలే న్యూ ఇండియా పార్టీ నాయకులుగా నాయకత్వాన్ని చేపట్టి రేపటి రోజున అధికారాన్ని కైవసం చేసుకుని ప్రజలే పాలకులుగా కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర నాయకులు జనగామ లక్ష్మీనారాయణ, కేంద్ర కమిటీ సభ్యులు శ్రీమతి గంటా భబిత, ఎం.గోపాల్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు