జహీరాబాద్ మే 6( జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర మైనారిటీ కమిషన్ మేంబర్ గా బాధ్యతలను స్వీకరించిన మొహమ్మద్ తన్విర్,శనివారం హైదరాబాద్ లోని మైనార్టీ కమిషన్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మైనారిటీ కమిషన్ మేంబర్ మొహమ్మద్ తన్విర్ ని మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైధ్య శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు అభినందించారు.ఆయన వెంట బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.




