Wednesday, 4 November 2026

వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను అదుకోవాలి

 

 

 

 

 

జహీరాబాద్( జనం సాక్షి) వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను అదుకోవాలి అని శనివారం ఆర్డీవో అగ్రికల్చర్ ఆఫీసర్ ఏ డి ఏ లను కలిసి నష్టపోయిన రైతుల గురించి వివరించి వినతిపత్రం ఇచ్చిన తెలంగాణ జన సమితి పార్టీ జహీరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆశప్ప ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా పంట నష్టం జరిగిన పొలాలను ప్రత్యేకంగా సర్వేలు నిర్వహించి రైతులకు జరిగినటువంటి నష్టపరిహారాన్ని తక్షణమే పరిహారం అందించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది అన్నారు. వర్షాల కారణంగా నష్టపోయినటువంటి పంట పొలాలను గుర్తించి తక్షణమే నష్టపరిహారం అందే విధంగా చూడాలని లేని పక్షంలో రైతులు తీవ్రంగా అప్పుల పాలు అవుతున్నారు అన్నారు. రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితికి వెలుతారు కావున అన్నదాతలను కాపాడాలని ప్రభుత్వానికి రిపోర్ట్ పంపించాలని తక్షణ సాయం కింద ఎకరానికి 50 వేల రూపాయలు చొప్పున నష్టపరిహారం అందించాలని రైతుల తరఫున కోరుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఝరాసంగం మండల అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, కోహిర్ మండల అధ్యక్షుడు అలిమ్, రైతు నాయకులు రాజు రెడ్డి, సంజీవరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్ కుమార్, సందీప్, వీరారెడ్డి, ఆరిఫ్, తదితరులు పాల్గొన్నారు.