
– పద్మభూషణ్ వెనక్కిచేందుకు భార్గవ నిర్ణయం
్ హైదరాబాద్,అక్టోబర్29(జనంసాక్షి):
ఇప్పటికే పలువురు శాస్త్రవేత్తలు దేశంలో జరుగుతున్న అకృత్యాలకు నిరసనగా తమకు లభించిన పలు అవార్డులను వెనక్కి ఇవ్వగా, తాజాగా ప్రముఖ శాస్త్రవేత్త పీ ఎమ్ భార్గవ తనకు లభించిన పద్మ భూషన్ అవార్డును తిరిగి ఇవ్వనున్నట్ల ప్రకటించారు.భార్గవ హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ మాలిక్యులార్ బయాలజీ
స్థాపకుడు. శాస్త్రవిఙ్ఞాన రంగంలో ఆయన సేవలకు గాను 1986లోపద్మ భూషన్ అవార్డు లభించింది. దేశంలోని హేతువాదం తీవ్రమైన భయాందోళనల మధ్య ఉన్నదనీ దీనికి నిరసనగా తన అవార్డుని వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో ప్రజాస్వామ్యం క్రమంగా మతతత్వ ప్రాతిపదికగా మారిపోతుందని భార్గవ అన్నారు.దేశంలో ప్రస్తుత పరిస్థితి
ఎమర్జెన్సీ ని తలపిస్తుందని భార్గవ ఆందోళన వ్యక్తం చేశారు.ఇది ఇలా ఉండగా
రచయితలు, శాస్త్రవేత్తలు, సినిమా దర్శకులు దేశంలో విద్వేష పూరిత వాతావరణానికి నిరసనగా తమకు లభించిన సాహిత్య అకాడవిూ అవార్డులు, జాతీయ అవార్డులు తిరిగి ఇస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ప్రముఖ చరిత్రకారులు రొమిల్లా థాపర్, ఇర్ఫాన్ హబీబ్, కే ఎన్ పనికర్, మృదులా ముఖర్జీలతో పాటు 53 మంది చరిత్రకారులు దేశంలో జరుగుతున్నటువంటి ఘటనలపై ప్రధాని నరేంద్రమోదీ ఎలాంటి హావిూ ఇవ్వకపోవడాన్ని ఓ ప్రకటనలో ప్రశ్నించారు.
దేశంలో ఎన్నడూ లేని విధంగా భావవ్యక్తీకరణపై అకృత్యాలు జరుగుతన్నాయని, అభిప్రాయ బేధాలను ‘ఫిజికల్ వాయిలెన్స్’ ద్వారా సరిదిద్దాలని చూస్తున్నారని యూపీలోని దాద్రీ ఘటన, ముంబైలోని సుధీంద్ర కులకర్ణిపై జరిగిన సిరా దాడి తెలుపుతున్నాయని చరిత్రకారులు ఆరోపించారు. రచయితలు నిరసనలు తెలిపితే రచనలు ఆపేయమని ప్రకటించడం, మేధావులను మౌనంగా ఉంచాలని చూడటమేనని చరిత్రకారులు విమర్శించారు.




