Wednesday, 4 November 2026

దేశంలో చిన్న రాష్ట్రం అయిన తెలంగాణకు 26 అవార్డులు

సంగారెడ్డి బ్యూరో,  జనం సాక్షి,  జూన్ 16  : -దేశంలో చిన్న రాష్ట్రం అయిన తెలంగాణకు 26అవార్డులు రావడం చరిత్ర అని,  సంక్షేమం అభివృద్ధి సమపాలనగా అందిస్తూ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శం ఆదర్శంగా నిలిచిందని టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు.దశాబ్ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం పట్టణ ప్రగతి   సంగారెడ్డి పట్టణంలోని PSR గార్డెన్ ఫంక్షన్ పట్టణ ప్రగతి దినోత్సవం జరుపుకున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన టీఎస్.హెచ్.డి.సి చైర్మన్ చింతా ప్రభాకర్  , జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి హాజరై ముందుగాజ్యోతి ప్రజ్వలన వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నాడు నేడు పట్టణ ప్రగతి నివేదికను చదివి వినిపించారు.ఈ సందర్భంగ  ఉత్తమ సేవలు అందించిన పారిశుద్ధ కార్మికులకు ప్రశంస పత్రం అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగాచింతా ప్రభాకర్ మాట్లాడుతూదేశంలో చిన్న రాష్ట్రం అయిన తెలంగాణకు 26 అవార్డులు రావడం చరిత్ర అని కొనియాడారు. అలాగే మన చిన్న రాష్ట్రానికి 26అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.సంక్షేమం అభివృద్ధి సమపాలనగా అందిస్తూ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శ అన్నారు.పట్టణంలోని పాత బస్టాండ్ లో వర్షాకాలం వస్తే వారి గోస వర్ణనాతీతం..ఇంట్లోకి నీళ్ళు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, మంత్రి దృష్టికి తీసుకెళ్తే వెంటనే స్పందించి పరిశీలించి రూ.7 కోట్లు మంజూరు చేసి సమస్యను పరిష్కరించారన్నారు.

సహాయం చేసిన వారిని మరవొద్దు..మనం సీఎం కేసీఆర్,వెంట ఉండి వారికి మద్దతు తెలుపుతూ మూడో సారి సీఎం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడీ ,మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయా లక్ష్మి రవి ,కమిషనర్ చంద్రశేఖర్ ,వైస్ చైర్మన్ లత విజేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, జెడ్పీటీసీ లు ,ఎంపీపీలు ,మున్సిపల్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.