Wednesday, 4 November 2026

సఫాయి అమ్మ ను సఫాయి అన్న ను సన్మానించిన డిజన్ సెక్రటరీ మేకల హరినాథ్

కంటోన్మెంట్ జనం సాక్షి జూన్ 16 తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఓల్డ్ బోయిన్ పల్లి 119 డివిజన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ లో పని చేస్తున్న శానిటేషన్ వర్కర్ సఫాయి అమ్మ సరస్వతి కు సలాం,శానిటేషన్ వర్కర్ శేఖర్ సఫాయి అన్నకు సలాం చేసి ఉత్తమ సేవలు అందించిన మీరు ఇరువురికి కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు,119 డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ సూచనల మేరకు ఓల్డ్ బోయిన్ పల్లి బిఆర్ఎస్ డివిజన్ సెక్రెటరీ మేకల హరినాథ్ వారిని శాలువాతోసన్మానించి నారు.ఈకార్యక్రమంలో శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ సంపత్ కుమార్,ఎల్బీనగర్ అసోసియేషన్స్ సభ్యులు శ్రీనివాస్,మహేష్,సుగుణమ్మ మరియు మహిళలు మున్సిపల్ సిబ్బంది,ఇతర కాలనీ సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.