బాజీరావురెండవ విడత యువ చైతన్య యాత్ర
నవంబర్ 20 జనం సాక్షి భైంసా రూరల్,
నిర్మల్ జిల్లా, ముధోల్ నియోజకవర్గ ఆర్ కె ఫౌండేషన్ వ్యవస్థాపకులు
బాజిరావు బొంస్లే యువనేత , ముధోల్ నియోగికవర్గము,
నిర్మల్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో పర్యటిస్తున్నారు.
యువతతో మమేకమై వారి సమస్యలను అడిగితెలుసుకుంటున్నారు.
ఈరోజు రెండవ విడత యువ చైతన్య యాత్ర సదస్సు సందర్బంగా స్థానిక సమస్యలను తెలుసుకొనుటకు, యువతకు మార్గనిర్దేశం చేయుటకు
బైంసా మండలంలోని తిమ్మాపూర్, పెంచికల్ పాడ్, విఠపుర్, ఎంకుర్ గ్రామాలను సందర్శించారు.
రైతులు, యువత వారి సమస్యలను యువనేత బాజిరావు బొంస్లే
వివరించడం జరిగింది.
మిల్లర్లు వరి ధాన్యం కొనుగోలులో మూడు కిలోల తరుగు తీస్తున్నారని రైతులు యువనేత బాజిరావు విన్నవించారు.
ఈ సమస్యను మార్కెటింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యేవిధంగా చూస్తానని హామీ ఇచ్చారు.
వివిధ గ్రామాల్లో రోడ్డు సదుపాయాలను పరిశీలించారు.
కొన్ని గ్రామాల్లో రోడ్డు సదుపాయం కల్పించేలా స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో కృషి చేస్తానని తెలిపారు.
అనంతరం పాదయాత్రగా తిమ్మాపూర్ వచ్చి యువ చైతన్య యాత్ర సదస్సు ఉద్దేశించి ప్రసంగిస్తూ
యువత అన్ని రంగాల్లో ముందుకు సాగడానికి ఆర్కే ఫౌండేషన్కృషి చేస్తుందని తెలియజేశారు




