దేశంలో 12వేల కేసులు నమోదు

న్యూఢల్లీి,నవంబర్‌1(జనంసాక్షి) : దేశంలో గడిచిన 24 గంటల్లో 12,514 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. తాజాగా మహమ్మారి నుంచి 12,718 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్‌ బారినపడి 24 గంటల్లో 251 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,42,85,814కు పెరిగాయి. ప్రస్తుతం 1,58,817 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 3,36,68,560 మంది బాధితులు కోలుకున్నారు.
వైరస్‌ ప్రభావంతో మొత్తం 4,58,437 మంది మృతి చెందారు. మరో వైపు దేశంలో టీకాల పంపిణీ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 1,06,31,24,205 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది.