దేశం చూపు తెలంగాణ వైపు
మంత్రి హరీశ్వర్ రావ్
కామారెడ్డి బ్యూరో , డిసెంబర్ 3, (జనంసాక్షి),
దేశం మొత్తం తెలంగాణా వైపు చూస్తోందని మంత్రి తన్నీరు హరీ శ్వర్ రావ్ ఆన్నారు. ఆయన శనివారంకామారెడ్డి జిల్లా లో నూతనంగా ఏర్పాటైన డోoగ్లి మండలాన్ని ప్రారంబించిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతు మన ముఖ్యమంత్రి కేసిఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా పథకాలు ప్రవేశ పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్తున్నారని ఆన్నారు. రైతు బంధు, రైతు భీమా, వ్యవసాయానికి ఉచితంగా 24గంటలు విద్యుత్తు లాంటి పథకాలతో రైతుల అభివృద్ధికి పాటుపడుతున్నామని తెలిపారు. అలాగే వృద్దులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, చేనేత,గీత కార్మికులకు నెలకు రెండు వేల రూపాయల పించన్ మన టీఆర్ఎస్ ప్రభుత్వము అందజేస్తోంద నిఆయన ఆన్నారు. వికలాంగులకు నెలకు 3000రూపాయలు పించన్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. పేదింటి ఆడపిల్లల వివాహానికి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలు ప్రవేశ పెట్టి ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేస్తున్నామని తెలిపారు. గర్భిణీలకు పౌష్టిక ఆహారం, నెలనెల ఆరోగ్య పరీక్షలు, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరిగేవిదంగా చర్యలు తీసుకుంటు న్నామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరిగి ఆడపిల్ల పుడితే 13వేల రూపాయల, మగపిల్లాడు పుడితే 12వేలరూపాయలు మన ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరిగిన బాలింతలకు ప్రభుత్వ వాహనంలోనే ఇంటి వరకు పంపుతు న్నామని తెలిపారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులు, కుంటలు బాగు చేసుకుని పంటపొలాలకు సాగు నీరందిస్తున్నామని తెలిపారు. మిషన్ భగీరథ పథకం తో ప్రతి ఇంటికి తాగు నీరందిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నపుడు చేయి పోయి సైకిల్ వచ్చినా, సైకిల్ పోయి చేయి వచ్చినా ప్రజల బతుకులు మారలేదని అన్నారు. తాగునీటికి, సాగు నీటిని తీవ్ర ఇబ్బందులు ఉండేవని గుర్తు చేశారు. తాగు నీటికోసం హ్యాండ్ బోర్ల వద్ద మహిళలు కొట్టుకునే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. ఇరుకైన సింగిల్ రోడ్లు, గతుకుల రోడ్లతో గ్రామాలకు కనీసం ఆటో కూడా వచ్చే పరిస్థితి ఉండేది కాదని అన్నారు . మన రాష్ట్ర అభివృద్ధి చూసి ఓర్వలేక కేంద్రం మన ప్రభుత్వము పై అనేక ఆంక్షలు విదిస్తోందని మంత్రి విమర్శించారు. రాష్ట్రానికి రావలసిన నిధులను ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. రైతుల మోటార్లకు మీటర్లు పెడితే ముప్పయి వేలకోట్ల రూపాయలు ఇస్తామని ఆంక్షలు విధించి ఆశ చూపుతోందని అన్నారు.ఈ షరతులకు మన ముఖ్య మంత్రి అంగీకరించ లేదని అన్నారు. తన బొందిలో ప్రాణం ఉండగా రైతుల మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని సిఎం కెసిఆర్ తెగేసి చెప్పారని అన్నారు. అలాగే మన రైతుల వడ్లు కొనకుండా కేంద్రంలో ఉన్న బిజేపి ప్రభుత్వం ఇబ్బందులు సృష్టించించినా బెదరకుండా మన సిఎం రాష్త్ర నిధులతో ఒక్క గింజ మిగల కుండా కోనుగోలు చేశారని తెలిపారు. అలాగే కరోనా కష్టకాలంలో ప్రభుత్వము దగ్గర డబ్బులు లేక రైతులకు రైతుబంధు డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఎంల్యేలు, మంత్రుల జీతాలు ఆపివేసి రైతు బందుడబ్బులు ఇచ్చిన ఘనత సిఎం కెసిఆర్ దే నని ఆయన అన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కాక ముందు పది జిల్లాలు ఉండేవని పరిపాలన సౌలభ్యం కోసం మనముఖ్య మంత్రి 33జిల్లాలు యేర్పాటు చేశారని తెలిపారు. అలాగే తెలంగాణ ఏర్పాటుకు ముందు 466మండలాలుండగా నేడు ఆ సంఖ్య 612కు చేరిందని తెలిపారు. ధరణి పథకం ఒక విప్లవాత్మక మైన మార్పు అని ఆయన అన్నారు. ఈపథకం తో రైతుల ఇబ్బందులు తొలగి పోయాయని తెలిపారు. మన పక్కనే ఉన్నా రాస్థ్రాలైన కర్ణాటక, మహారాష్ట్రాలలో వృద్ధాప్య పింఛన్లు 600రూపాయల నుండీ 1000రూపాయల లోపే ఇస్తున్నారని ఆయన తెలిపారు. తెలంగాణా లో జరుగుతున్న అభివృద్ధిని చూసి బిజేపి పాలిత రాష్ట్రమైన మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన 25 గ్రామాల సర్పంచ్ లు మా గ్రామాలను తెలంగాణా లో విలీనం చేసుకోవాలని కోరారని మంత్రి తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కారు ట్రబుల్ ఇంజన్ సర్కారు అని ఏద్దేవా చేశారు. జుక్కల్ నియోజక వర్గం ఏంల్యే హన్మంతు షిండే కోరిక మేరకు పీట్లం మండలములోని చిల్లర్గి లో, జుక్కల్ మండలములోని మహమదాబాద్ లో పీహెచ్ సీ మంజూరీ చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపి బీ బీ పాటిల్, జిల్లా పరిషత్ చైర్మన్ దాఫెదార్ శోబారాజు , ఎం ఎల్ సి విజి గౌడ్, డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పి శ్రీనివాస్ రెడ్డి, స్ధానిక ఎంపిపి లక్ష్మీ బాయి బస్వంత్ రావ్, జడ్ పిటిసి అనిత కథలయ్య,
సర్పంచ్ మహాదేవిశశాంక్ పాటిల్, మద్నూర్, పిట్లం,బిచ్కుంద మార్కెట్ కమిటి చైర్మన్ లు సాయ గౌడ్, బాబుసింగ్, మల్లికార్జున్, డిసిసిబి డైరక్టర్ రాం పటేల్, ప్రజా ప్రతినిదులు, టీఆర్ఎస్ నాయకులు, కార్య కర్తలు పాల్గోన్నారు.
దేశం చూపు తెలంగాణ వైపు




