మైనార్టీ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం.
జనం సాక్షి ఉట్నూర్
ఆసిఫాబాద్ నియోజవర్గంలోని నార్నూర్ మండల ముస్లిం కమిటీ సభ్యులు శుక్రవారం రాత్రి 11 గంటలకు క్యాంప్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే ఆత్రం సక్కు నీ కలిసి మైనార్టీ ఫంక్షన్ హాల్, ఈద్గా కొరకు సీసి రోడ్డు కోసం వినతి పత్రం అందజేశారు.దీనికి ఎమ్మెల్యే ఆత్రం సక్కు సహానుకులంగా స్పందించి 60×80ఫిట్ తో ఫంక్షన్ హాల్ నిర్మిస్తానని హామీ ఇచ్చారు.అనంతరం ముస్లిం కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ఆత్రం సక్కు రాత్రి 11గంటలకు స్పందించడంతో ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మజిద్ కమిటీ నాయాబ్ సదర్ మొహమ్మద్ ఖురేషి నార్నూర్ కో ఆప్షన్ సభ్యుడు షేక్ దస్తగిర్ తెరాస పార్టీ జనరల్ సెక్రెటరీ సయ్యద్ కాసిం కమిటి సభ్యులు హాసన్ ఖాన్ సుల్తాన్ ఖాన్ షేక్ దాదే అలీ పాష ఖాన్ ఫిరోజ్ ఖాన్ రియాజుద్దీన్ బషీర్ బాబు భాయ్ రాహీల్ ఖాన్ అలహం ఖాన్ సలీం మసూద్ మున్న ఉన్నారు.




