జుక్కల్, ఎప్రిల్ 16, (జనంసాక్షి),కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలోని పెద్ద కొడప్ గల్ మండల ఎంఆర్పిఎస్అధ్యక్షుడిగా సర్వగల్ల రవీందర్ మాదిగ ను ఆదివారం ఏకగ్రీవం గా ఎన్నుకున్నట్లు ఎమ్మార్పీఎస్ టీఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు భూమయ్య తెలిపారు. అలాగే కమిటీ సభ్యులనుకూడ ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు.ఈ కమిటిని తాత్కాలికంగా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.గౌరవ అధ్యక్షులుగా మేతరి సాయిలు మాదిగ,ఉపాధ్యక్షులుగా జోగిని బలరాం మాదిగ,
కార్యదర్శులుగా ఎర్రోళ్ల రాజు మాదిగ,ఎర్రోళ్ల మారుతి మాదిగ, కోశాదికారిగా సోంపేట సాయిలు మాదిగ, ప్రచార కార్యదర్శిగా పండరి మాదిగ,సలహాదారులుగా అలిగే దేవయ్య మాదిగ,కమిటీ సభ్యులుగా బాలరాజు మాదిగ తదితరులను ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలోజిల్లా ఉపాధ్యక్షులు అంజయ్య , జెడ్, పి హెచ్ ఎస్ స్కూల్ చైర్మన్ మారుతి, మండలం లోని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.




