దేశానికి దశా,దిశ కేసీఆరే..
` జాతీయ రాజకీయాల్లోకి రావాలి
` రైతురాజ్యం స్థాపించాలి
` మంత్రి నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి):ఈ దేశానికి ప్రత్నామ్నాయం రావాలని… అది కేసీఆరే కావాలని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ నాయకత్వ ఆవశ్యకత, మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ‘‘ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్.అల్పులు, సంకుచిత ధోరణి ఉన్నవాళ్లు ఈ దేశాన్ని పాలిస్తుండడం అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశర్.పాలకుల యొక్క పోకడల విూద విశాలమైన అవగాహన, అందివస్తున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని సజావుగా వినియోగిస్తూ మానవ కళ్యాణానికి తోడ్పడాల్‌ి.అలా కాకుండా విద్వేషపూరితంగా, వినాశనం దిశగా మానవత్వ కోణం లేకుండా ఈ దేశాన్ని నడిపిస్తుండడం ఆందోళన కలిగించే అంశర్.ఈ నేపథ్యంలో దేశ రాజకీయాల్లో కేసీఆర్ కీలకపాత్ర పోషించాలని ప్రజల నుంచిడిమాండ్ వస్తోంది.ఇది రాజకీయ కాంక్ష కాదు.. ఈనాటి అనివార్య పరిస్థితుల్లో ముఖ్య అవసరర్.90వ దశకంలో తెలుగునేల నుండి జాతీయస్థాయి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసింది తెలుగు చైతన్యమేమాకు ఎదురులేదన్న కాంగ్రెస్ ను అతలాకుతలం చేసి నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ లు ఏర్పడి ఈ దేశ ఫెడరల్ స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచాయి.ప్రాంతీయ పార్టీల కలయికే ఈ దేశానికి ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు అందించగలవని చరిత్రలో రుజువయింది.ఈ దేశం ఏ రాజకీయ పార్టీ గుత్తాధిపత్యం కాదు.ఈ దేశం రాష్ట్రాల సమాహారం. భిన్నసంస్కృతులు, భాషలు, ఆచార వ్యవహారాలు కలిగిన భారత్ ఓ వైవిధ్య భరితమైన దేశంభారతదేశం పరిణతి చెందిన ప్రజాస్వామ్యాన్ని కలిగి ఉన్నది.భారత ప్రజలు వివిధ సందర్భాల్లో తాము కోరుకున్న ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడం అందరూ చూస్తున్నదేప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా మరో ప్రభుత్వం రావాలని ప్రజల మనసుల్లో బలంగా ఉంది .. దానికి ప్రాతిపదిక సిద్దంగా ఉన్నది.నేడు సమర్దవంతంగా నడవని కేంద్రం, ప్రజల అభిలాషలు నెరవేర్చని కేంద్రం .. జనసామాన్యం జీవితాలు అతలాకుతలం చేసింది.ప్రైవేటు, బడా కార్పోరేట్లకు మాత్రమే తోడ్పడుతున్నది.దేశంలోని 60 శాతం ప్రజలు ఆధారపడిన రైతాంగం జీవితాలను పట్టించుకోవడం లేదు.ఎదుగుతున్న సమాజాన్ని కేంద్రం కుత్సిత బుద్దితో విభజించి ప్రజల మధ్య అగాధాలు సృష్టించి విడదీస్తున్నది.ఆధునిక యుగంలో ఆధునిక మానవులుగా అవతరించకుండా దుర్మార్గంగా ప్రవరిస్తున్నది.ఈ నేపథ్యంలో దేశ ప్రజలను ఐక్యంగా ఉంచడం ఒకటి .. ప్రజల అవసరాలను గుర్తించి మానవ వనరులను, సహజ వనరులను సద్వినియోగ పరచాల్సిన దక్షత, దార్శనికత అవసరం ఉన్నదిఅందుకే దార్శనిక పాలకులు రావాలని ప్రజలు భావిస్తున్నారుసకల వనరులు ఉండి ప్రపంచంలో అగ్రగామిగా ఉండాల్సిన భారత్‌లో 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా అమలవుతున్న విధానాలు తిరోగమనం వైపు సాగుతున్నాయి.మోడీ కంటే ముందే కేసీఆర్ 1985లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.అ తర్వాత ఏడుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు.మంత్రిగా , డిప్యూటీ స్పీకర్‌గా, కేంద్రమంత్రిగా, రెండు సార్లు ముఖ్యమంత్రి కావడమే కాకుండా 14 ఏండ్లు భారత రాజ్యాంగ పరిధిలో ఒక మహా సుధీర్ఘ ఉద్యమాన్ని నడిపి రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా ..దేశానికి రాష్ట్ర అభివృద్ధిని ఆదర్శంగా నిలిపారు.అదే మోడీ 2002 నుంచి ముఖ్యమంత్రిగా,ఎనిమిదేండ్లు ప్రధానిగా ఉన్నా కేసీఆర్ కన్నా జూనియర్ పలు మాజీ దేశాధినేతలు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులతో అభినందనలు పొందారు.అత్యంత పరిజ్ఞానం, లోతైన పరిశోధన, ఆంగ్ల, తెలుగు, ఉర్దూ ( హింది) భాషల్లో అనర్గళంగా మాట్లాడి ప్రజలను ఆకట్టుకునే ఆయన ప్రసంగాలు ప్రజలను కదిలించాయి, కదిలిస్తున్నాయి. ఆలోచింపచేస్తున్నాయి.ఈ దేశంలో భిన్న పార్టీలను కలిపి నడిపే దీక్ష, దక్షత కేసీఆర్ కు మాత్రమే ఉన్నది.ఈ సువిశాల దేశానికి నాయకత్వం వహించే వ్యక్తి తెలంగాణ నుంచి ఎదగడం ఈ నేల గర్వించదగ్గ విషయం.పరాయి పెత్తనాన్ని మోసే బానిసలు ఈ గొప్పతనం గమనించ లేరు.ఇక్కడి చైతన్యం ఈ ప్రజల జీవితాల నుండి పుట్టిన అనుభవం.ఈ దేశంలోని పీడిత, తాడిత ప్రజల భవిష్యత్ కేసీఆర్ నాయకత్వంలో మరింత అర్థవంతంగా ఉంటుంది’’ అన్నారు.