:శామీర్ పేట్, జనం సాక్షి :తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించారు . మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక, శామీర్ పేట్ మండలంలోని అలియాబాద్ రైతు వేదిక వద్ద నిర్వహించిన రైతు దినోత్సవాల్లో కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, సీఎం కేసీఆర్ సారధ్యంలో రైతులకు అన్ని సదుపాయాలు కల్పించారని తెలిపారు. రైతు భీమా, రైతు బందు, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, రైతులకు సొసైటీల ద్వారా సబ్సీడీలు, తక్కువ ధరలకే ఎరువులు అందిస్తూ రైతులకు మేలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నంపెట్టే అన్నపూర్ణ రాష్ట్రంగా ఎదిగిందని, అది సీఎం కేసీఆర్ కే దక్కుతుందని చెప్పారు. మూడుచింతలపల్లి లో బోనాలు తో మంత్రి మల్లారెడ్డి ట్రాక్టర్ పై ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, డీసీఎంఎస్ వైస్ ఛైర్మన్ మధుకర్ రెడ్డి, మూడుచింతలపల్లి, శామీర్ పేట్ మండలాల ఎంపీపీలు హారిక మురళీ గౌడ్, ఎల్లు బాయి బాబు, శామీర్ పేట్, మండల జెడ్పీటీసీ అనిత లాలయ్య, మూడుచింతలపల్లి, శామీర్ పేట్ మండలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, విలసాగరం సుదర్శన్,సర్పంచ్ లు కుమార్ యాదవ్, జాం రవి,నాయకులు శ్రీనివాస్ రెడ్డి,కృష్ణారెడ్డి,లక్ష్మారెడ్డి,భారీ సంఖ్యలో రైతులు, నాయకులు పాల్గొన్నారు.
దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణ తెలంగాణ రాష్ట్రం :మంత్రి మల్లారెడ్డి




