Thursday, 5 November 2026

దేశానికే ఆదర్శంగా కేజీ టు పీజీ విద్య

సీఎం కేసీఆర్ మానస పుత్రిక కేజీ టూ పీజీ విద్యను భారతదేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి ఈటెల. విద్యావ్యవస్థను గాడిలో పెడితేనే బంగారు తెలంగాణ నిర్మాణం జరుగుతుందని చెప్పారు. కరీంనగర్ లోని శాతవాహన యూనివర్సిటీలో కొత్తగా నిర్మించిన హాస్టల్, డైనింగ్ హాల్, క్యాంటీన్, లైబ్రరీ భవనాలను వారు ప్రారంభించారు. వీటితో పాటుగా ఆర్ట్స్, సోషల్, సైన్స్, కామర్స్, స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్ మెంట్ భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వినోద్, ఎమ్మెల్యేలు బాలకిషన్, గంగుల కమలాకర్, దాసరి మనోహర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ తుల ఉమ, మేయర్ రవీందర్ సింగ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *