Tuesday, 3 November 2026

దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన బహుభాషా కోవిదుడు పివి నరసింహారావు.

;-టీపీసీసీ సభ్యులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వల్లభ రెడ్డి.
;-పీవీ కి ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు.
;-నాగర్ కర్నూల్ బ్యూరో, జనంసాక్షి:మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగాటీపీసీసీ సభ్యులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వల్లభ రెడ్డి మాట్లాడుతూ పీవీ నరసింహారావు పరిపాలన లో ఆర్థిక సంస్కరణలకు ఉతం ఇచ్చి భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు తైలి శ్రీనివాసులు ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ భాస్కర్ ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.