Tuesday, 3 November 2026

పికెట్ బస్సును పునరుద్ధరించండి రైతు కోఆర్డినేటర్ చల్లా శ్రీనివాస్ రెడ్డి

బచ్చన్నపేట జూన్ (జనం సాక్షి)ఇంతకుముందు ఆకునూరు. సాల్వాపూర్ మార్గంలో వెళ్లే పికెట్ బస్సును యధావిధిగా నడకవలసిందిగా బచ్చన్నపేట మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చల్ల శ్రీనివాస్ రెడ్డి జనగామ డిపో మేనేజర్ కు విన్నవించినట్టు విలేకరులకు తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ. విద్యార్థుల కోసం జనగామ బస్ ను, జనగామ నుండి సిద్దిపేట వెళ్ళు బస్ లలో రెండు బచన్నపేట లింగంపల్లి,పడమటి కేశ్వాపూర్ చేర్యాల మీదుగా సిద్దిపేట నడుపుటకు వినతి చేయగా గౌరవ DM గారు సానుకూలంగా స్పందించి రేపటినుండి స్కూల్ పిల్లల బస్ పునరుద్ధరించి మిగతా వినతుల గురించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు., BRS నాయకులు శశిధర్ రెడ్డి మరియు నాగిరెడ్డి పల్లి ఉప సర్పంచ్ శ్రీనివాస్ గారు కృతజ్ఞతలు తెలియజేశారు.