– సూర్యాపేట డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): దేశ సమైక్యత సమగ్రత కోసం ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేపడుతున్న 4080 కిలోమీటర్ల భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా దేశంలోని ప్రతి పౌరుడికి రాహుల్ గాంధీ సందేశం చేరవేయాలనే ఉద్దేశంతో చేపట్టనున్న హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమాన్ని సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించడం జరిగిందని డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ తెలిపారు.సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డులో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అంజాద్ అలీ అధ్యక్షతన ఆ వార్డు భాద్యులు అన్నమయ్య రాము,చెరుకు రాము,నల్లమాస సైదులు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గడప గడపకు తిరుగుతూ హాథ్ సే హాథ్ జోడో ప్రాముఖ్యతను వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను ప్రజలకు అందజేస్తూ, డోర్ స్టిక్కర్లను అంటించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి చేరే విధంగా కృషి చేయాలని, ప్రజాస్వామ్యం పై జరుగుతున్న దాడిని ఖండిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే సదుద్దేశ్యంతో, పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు కాని పరిస్థితుల్లో జరుగుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని యాత్రకొనసాగించడంజరుగుతుందన్నారు.నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా అనవసరమైన విషయాలను చర్చకు తీసుకువచ్చి సమస్యలు సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రానంతరం దేశ నిర్మాణం కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన కృషిని గాని, దేశ నిర్మాణంలో చేసిన త్యాగాలను చరిత్రను మర్చిపోకుండా కాంగ్రెస్ పార్టీని బలపరచాలని ప్రజలను కోరుతూ, ఈ హాథ్ సే హాథ్ జోడో యాత్ర 60 రోజులపాటు ప్రతి ఇంటింటికి చేరు విధంగా కొనసాగుతుందని, ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్ర సూర్యాపేట నియోజవర్గ కన్వీనర్ దారావత్ వీరన్న నాయక్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనురాధ కిషన్ రావు, పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెంచల శ్రీనివాస్, సూర్యాపేట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, సూర్యాపేట మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, పెన్పహాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూముల సురేష్ రావు,కౌన్సిలర్ వేములకొండ పద్మ సైదులు, జిల్లా సేవాదళ్ చీఫ్ ఆలేటి మాణిక్యం,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కాసా రంగయ్య, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శులు నాగుల వాసు,అక్కేనపల్లి జానయ్య, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఓబీసీ సెల్ ఉపాధ్యక్షుడు గుంటి సైదులు ముదిరాజ్,పట్టణ కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షుడు రావుల రాంబాబు,జిల్లా కాంగ్రెస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ యలగందుల సాయినేత, రెడ్ హౌస్ ఇంచార్జ్ నరేందర్ నాయుడు,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పఠాన్ సమీర్,మన్నెం అరుణ, జిల్లా కాంగ్రెస్ నాయకులు గార్లపాటి వెంకట్ రెడ్డి,జమండ్ల సత్యనారాయణ రెడ్డి, గుద్దేటి వెంకన్న,కోడి శివ, వాంకుడోతు రవి, పసుల అశోక్ యాదవ్,చింతల నాగరాజు, చెరుకు సాయి,ఖమ్మంపాటి మధుకర్,శివ నాయక్, మండల సంజయ్మ,మహేష్,సాత్విక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




