రజక కుల పెద్ద చాపర్తి రాజుజనం సాక్షి, చెన్నరావు పేటతెలంగాణ శాసనసభ 2023/24 బడ్జెట్ సమావేశాలలో రజక,నాయి బ్రాహ్మణ ఫెడరేషన్లకు తెలంగాణ బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దురదృష్టంగా భావిస్తు సమాజంలో అన్ని కులాలకు, మతాలకు అతీతంగా సేవలందిస్తున్నటువంటి కుల వృత్తులలో అత్యంత వెనుకబడినటువంటి రజకులు, నాయి బ్రాహ్మణుల ఫెడరేషన్ల ప్రస్తావన బడ్జెట్లో లేకపోవడంపై నిధులు కేటాయించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, అలాగే ఫెడరేషన్లకు నిధులు కేటాయించగలరని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో చెన్నారావుపేట రజక కుల పెద్ద చాపర్తి రాజు, ఎడ్ల రమేష్,మర్రి మధుకర్, వంశీ, ప్రశాంత్, రవి, కిరణ్,రంజిత్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.




