తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గారికి దళిత సంఘాల ఆధ్వర్యంలో ఫిర్యాదఫిర్యాదు పై స్పందించి కమిషనర్ కు షోకాస్ నోటీసులు జారీ చేసినట్లుగా తెలిపిన జిల్లా కలెక్టర్
భువనగిరి టౌన్ (జనం సాక్షి):–భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల ప్రభుత్వ అధికారులు ఏ హోదాలో ఉన్న ఆ మహానుభావుని అవమానపరిచినట్లయితే ప్రభుత్వం ఇచ్చిన నియమ నిబంధనల ప్రకారం ఉల్లంఘన చేసిన భువనగిరి మున్సిపల్ కమిషనర్ బి, నాగిరెడ్డి పై షోకాస్ నోటీసులు జారీ చేసినట్లుగా అతను ఇచ్చిన సమాధానం బట్టి అతనిపై చర్యలు ఉంటాయని దళిత సంఘాలు ప్రజా సంఘాలు అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి గారిని కలిసి 74వ గణతంత్ర దినోత్సవం వేడుకలలో భువనగిరి పెద్ద చెరువు కట్ట పైన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ కమిషనర్ ఉద్దేశపూర్వకంగా తమరు ఆదేశాలను లెక్కచేయకుండా రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పెట్టకుండా స్థానిక సంస్థల జిల్లా కలెక్టర్ దీపక్ తివారి భువనగిరి శాసనసభ్యుల సమక్షంలో జాతీయ జెండా ఎగరవేసిన తరుణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టకుండా మహనీయుని అవమానపరిచిన దానిపై ఫిర్యాదు చేయగా జిల్లా కలెక్టర్ గారు స్పందించి మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ బి, నాగిరెడ్డి నిన్నటి రోజునే షోకాస్ నోటీసులు జారీ చేసినట్లుగా ప్రజాసంఘాల నాయకులకు తెలియజేశారు ఇట్టి విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిన ఎవరి పైన ఎంతటి స్థాయి అధికారి పైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయని బాబాసాహెబ్ అంబేద్కర్ విషయం పట్ల భారత .రాజ్యాంగ నిర్మాత కాబట్టి ఆయనకు గౌరవము భావితరాలకు తెలియజేయాల్సిన అధికారులే నిర్లక్ష్యాన్ని చేయడాని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని దీని విషయంలో ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని అఖిలపక్ష రాజకీయ పార్టీలు దళిత సంఘాలు ప్రజాసంఘాల నాయకులు అన్నారు. ఈకార్యక్రమంలో దళిత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ వైయస్సార్ టిపి జిల్లా అధ్యక్షులు అతహార్ కౌన్సిలర్లు ఈరపాక నరసింహ వడిచర్ల కృష్ణ యాదవ్ పడిగెల ప్రదీప్ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు కుతాటి సురేష్ బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు రావుల రాజు పిట్టల బాలరాజ్ పల్లెల యాదగిరి నివాస్ అందే నరేష్ వసీం అక్రం మహేందర్ సాయి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.




