Wednesday, 4 November 2026

ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి.

దౌల్తాబాద్ జూన్ 4, జనం సాక్షి.ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని చెట్ల నర్సంపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిన్నమోల్ల యాదగిరి (46) వ్యవసాయ పనుల నిమిత్తం ఉదయం పొలం వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టు ఢీ కొట్టాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గజ్వెల్ ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని కుమారుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు.