హుజూర్ నగర్ జూన్ 4 (జనంసాక్షి): ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రైతులకు అవగాహన లోపంతో చేస్తున్న పనులకు పచ్చని చెట్లు అవిరైపోతున్నాయనిసామాజిక ఆర్టిఏ కార్యకర్త షేక్. మన్సూర్ అలీ అన్నారు. ఆదివారం పట్టణ పరిధిలోని మఠంపల్లి రోడ్డు మగ్దుమ్ నగర్ శివారులో పంట పొలాల్లోని వరి కొయ్యలకు రైతులు నిప్పు పెట్టడాన్ని గమనించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు తమ పొలాలలో సరియైన అవగాహన లేక వరికొయ్యలకు నిప్పు పెట్టడం వలన భూమిలోని భూసారాన్ని పెంచే మంచి సూక్ష్మజీవులు కూడా నశించి భూసారం తగ్గి దిగుబడులు తగ్గుతున్నాయన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ జిల్లాలోని వ్యవసాయ శాఖ అధికారులు బాధ్యత రాహిత్యం వలన రైతులకు అవగాహన కల్పించకపోవడంతో రైతులు వారి ఇస్టాను సారంగా వరి కొయ్యలకు నిప్పులు పెట్టడం వల్ల ఆ మంటలు రోడ్ల ప్రక్కన ఉన్న చెట్లకు అంటుకొని అవి కాలి బూడిద అయిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు కళ్లు తెరిచి రైతులకు పూర్తి అవగాహన కల్పించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.
వరి కోయల నిప్పుకు పచ్చని చెట్లు బూడిద మయం – ఆవిరైపోతున్న పర్యావరణం – రైతులకు అవగాహన కల్పించడంలో వ్యవసాయ శాఖ అధికారులు విఫలం – కాలుష్య కోరల నుంచి ప్రజలను రక్షించాలి




