సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ నుండి పాత మార్కెట్ వరకు సురక్ష దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మండుటెండలో సైతం ఈ ర్యాలీలో పాల్గొన్న వారికి ఉపశమనం కొరకు మజ్జిగ, చల్లని మంచినీరు సుమన్ యువసేన ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సుమన్ యువసేన జిల్లా అధ్యక్షులు గుండా వెంకన్న మాట్లాడుతూ గత ఏడేళ్లుగా సుమన్ యువసేన ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తా వద్ద చలివేంద్రం ఏర్పాటు చేసి బాటసారుల దాహార్తిని తీర్చుటకు మజ్జిగ, మంచినీరు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.సురక్ష దినోత్సవాన్ని పురస్కరించుకొని ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గాంధీ చౌరస్తా వద్ద మంచినీరు, మజ్జిగ పంపిణీ చేసినట్లు తెలిపారు.తెలంగాణ దశాబ్ది వేడుకల్లో సుమన్ యువసేన సైతం సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొనడం గర్వంగా ఉందన్నారు. సూర్యాపేటలో ఏ మంచి కార్యక్రమం నిర్వహించిన తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సుమన్ యువసేన సభ్యులు గోపారపు రాజు, బొల్లం సురేష్ , గుడిపాటి రమేష్, పబ్బా ప్రకాష్, చందా రాజశేఖర్, యాట సతీష్, కర్నాటి రంగయ్య , మొరిశెట్టి రాము తదితరులు పాల్గొన్నారు.
సుమన్ యువసేన ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ




