ధరణి పోర్టర్ ను వెంటనే రద్దు చేయాలి డిసిసి ప్రధాన కార్యదర్శి
కే హనుమంతు ముదిరాజ్
దోమ నవంబర్ 24(జనం సాక్షి)
తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎమ్మార్వోలో కార్యాలయాల యందు ధరణి పోర్టర్‌ను రద్దు చేయాలని అదేవిధంగా రైతుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధినేత టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు ఈరోజు తేదీ. 24/11/2022 పరిగి యందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి పరిగి ఎమ్మార్వో గారికి మెమోరండము ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా డిసిసి ప్రధాన కార్యదర్శి కే హనుమంతు ముదిరాజ్, డిసిసి ఉపాధ్యక్షులు ఉడ్లాల్ కృష్ణ ప్రసాద్, బ్లాక్ అధ్యక్షులు పార్థసారథి పంతులు, మాట్లాడుతూ ధరణి పోర్టర్ వలన అనేక అవకతవకలు జరుగుతున్నాయని దీనివలన ఎకరానికి లక్షా రెండు లక్షలు అవినీతికి బలపడుతున్నారని అందువల్ల వెంటనే ఈ యొక్క ధరణిని రద్దు చేయాలని అదే విధంగా రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఎటువంటి మోసం జరగకుండా చూడాలని, ఏకకాలంలో రైతులకు లక్ష రూపాయలు రుణం మాఫీ చేయాలని సందర్భంగా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎకరానికి రెండు లక్షలు ఇస్తామని ప్రకటించారు దాన్ని గుర్తించాలని కోరారు. ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు,
పరిగి మండల అధ్యక్షుడు పరశురాం రెడ్డి పరిగి
పట్టణాధ్యక్షుడు ఎర్రగడ్డ పులి కృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుందని గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి అనేక సంక్షేమ పథకాలు అందించిందని అందువలన కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు చేరాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు దండు అశోక్, కౌన్సిలర్ మల్లేష్ అభిరామ్ పంతులు ,జగన్ గుప్త నజీర్, రామచందర్ యాదవ్ ,యూత్ కాంగ్రెస్ నాయకులు నాగ వర్ధన్ , ఎర్రగడ్డ పల్లి జగన్, రామకృష్ణారెడ్డి, ఎజాజ్, శ్రీకాంత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.
ధరణి పోర్టర్ ను వెంటనే రద్దు చేయాలి డిసిసి ప్రధాన కార్యదర్శి




