మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిమృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
మోత్కూరు నవంబర్ 24 జనంసాక్షి : అడ్డగూడూరు మండల పరిధిలోని బొడ్డుగూడెం గ్రామంలో కందల పురుషోత్తం రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. గురువారం భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మృతుని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా టెలికామ్ అడ్వైజర్ కమిటీ మెంబర్ టీపీసీసీ రాష్ట్ర నాయకులు ఇటికాల చిరంజీవి వారితో పాటు జిల్లా కాంగ్రెస్ నాయకులు అండెం సంజీవ రెడ్డి, లక్ష్మీదేవికాల్వ సర్పంచ్ నారగోని అంజయ్య, కంచనపల్లి సర్పంచ్ కుకునూరి జ్యోతి-విష్ణువర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగాల నర్సిరెడ్డి, బాలెంల సురేష్, వల్లంబాట్ల రవీందర్, పోలేపాక అబ్బులు, కంబాల వీరయ్య, చిప్పలపల్లి పరుశరాములు, సుధాకర్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు సురారం నవీన్, మండల యూత్ నాయకులు బైరెడ్డి సందీప్ రెడ్డి, చుక్క శ్రీకాంత్, ఎండీ షేకిల్, చిప్పలపల్లి మహేష్, నాగార్జున్, తదితరులు పాల్గొన్నారు.
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ కోమటిరెడ్డి




