ప్రజా గోస బిజెపి భరోసా ను జయప్రదం చేయండి.ప్రజా గోస బిజెపి భరోసా ను జయప్రదం చేయండి.బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిడనూరి దిలీప్ ఆచారి.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,నవంబర్24 (జనంసాక్షి):నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఈనెల 25 నుండి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రజాగోస బిజెపి భరోసా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఇన్చార్జి నెడనూరి దిలీప్ ఆచారి పిలుపునిచ్చారు.గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సమస్యలను గుర్తిస్తూ,రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు చేస్తున్న దౌర్జన్యాలను ప్రజలకు తెలియ జేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు.ఈనెల 25 శుక్రవారం బిజినపల్లి మండల పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో ప్రారంభమవుతుందని,ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర నాయకులు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్లు తెలిపారు.మండలంలోని అన్ని గ్రామాలను సందర్శిస్తూ గ్రామాలలో నెలకొని ఉన్న సమస్యలను తెలుసుకుంటూ,రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ఈ ర్యాలీ కొనసాగుతుందని,సాయంత్రం బిజినపల్లి మండల కేంద్రంలో ముగింపు సభ ఉంటుందని తెలిపారు.ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమాన్ని నియోజకవర్గమంతా పల్లె పల్లె లో చేపడుతున్నామని ప్రతిరోజు నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి జాతీయ మరియు రాష్ట్ర నాయకులు హాజరవుతారని తెలిపారు.టిఆర్ఎస్ ప్రభుత్వం గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అక్రమాలు చేస్తూ దాడులు జరుపుతూ కబ్జాలు చేస్తూ అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ మద్యాన్ని ఏరులై పారిస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో చేపట్టిన రైతుబంధు,దళిత బంధు, పెన్షన్ వంటి పథకాలకు 25 వేల కోట్లు ఖర్చు అవుతుందని అయినా రాష్ట్రంలో మద్యం దుకాణాల నుండి 45 వేల కోట్లు ఆదాయం వస్తుందని ఈ ఆదాయం ఎక్కడికి పోతుందని ప్రశ్నించారు. ఈ సమావేశంలో పార్లమెంటు కన్వీనర్ బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి అసెంబ్లీ కన్వీనర్ కశిరెడ్డి భాస్కర్ రెడ్డి బిజెపి మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు మహమ్మద్ జాకీర్ హుస్సేన్ బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు విజేందర్ రెడ్డి నాగర్ కర్నూల్ మండల అధ్యక్షులు బచ్చిరెడ్డి తాడూరు మండల అధ్యక్షులు రోహిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజా గోస బిజెపి భరోసా ను జయప్రదం చేయండి.ప్రజా




