Thursday, 5 November 2026

బాధిత కుటుంబానికి ఆర్థిక సహౕయం

బాధిత కుటుంబానికి ఆర్థిక సహౕయం..
ఊరుకొండ, నవంబర్ 24 (జనంసాక్షి):
ఊర్కోండ మండల పరిధిలోని రాచాలపల్లి గ్రామానికి చెందిన కొమ్ము మల్లమ్మ(80) అనారోగ్యంతో మృతి చెందింది. స్థానిక నాయకుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న స్థానిక శాసన సభ్యులు చర్లకోల లక్ష్మారెడ్డి మృతురాలి కుటుంబానికి తన ప్రగాఢ సానుభుతి తెలియజేస్తూ రూ.5వేల ఆర్థిక సహాయం మృతురాలి కుమారుడు కొమ్ము జంగయ్యకు స్థానిక టీఆర్ఎస్ నాయకుల ద్వార అందజేయడం జరిగింది. మల్లమ్మ మృతి పట్ల పలువురు గ్రామ ప్రజలు మరియు నాయకులు ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సానుభుతి తెలియచేశారు. కార్యక్రమంలో నాయకులు అమరేష్ రెడ్డి, ఉపసర్పంచ్ పరుశ రాములు, డైరెక్టర్ వెంకటయ్య, రమేష్ గౌడ్, భాషా, సత్యనారాయణ, నిరంజన్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.