ధరణి పోర్టులతో దొరలకే పట్టం కట్టిన టిఆర్ఎస్ ప్రభుత్వం…
రాష్ట్రంలో పేదల భూములు లాక్కుంటున్న నూతన రెవెన్యూ చట్టం…
22/ఏ ధరణి లో పేదలకు అనేక సమస్యలు..
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సత్యనారాయణ…
శంకరపట్నం: జనం సాక్షి నవంబర్ 24
తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌తో దనిక్కులకే భూస్వాములకే అధిక లాభం చేకూరిందని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కమ్మంపల్లి సత్యనారాయణ ఆరోపించారు. బుధవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్ అధ్యక్షతన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణలో ధరణి పోర్టల్ ను ప్రవేశపెట్టిన టిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ 22 బై ఏ ధరణి సమస్యలను పరిష్కరించాలని, కాంగ్రెస్ పార్టీ 2006లో పేద కుటుంబాల కోసం చట్టం ప్రవేశపెట్టి పేద కుటుంబాలకు అసైన్డ్ భూములను పంపిణీ చేసిందని గుర్తు చేశారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేద కుటుంబాలకు చెందిన వారి వద్ద ఉన్న అసైన్డ్ భూములను దౌర్జన్యంగా లాగుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, పోడు భూములు, అసైన్డ్ భూములను పేదలకే పేదలకే చెందేలా ధరణి పోటోల్లో 22 బై ఏ లో ఉన్న సమస్యలను తొలగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ, అధ్యక్షులు ఏ రేవంత్ రెడ్డి పిలుపుమేరకు ఈనెల 24న తాసిల్దార్ కార్యాలయంలో ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టి తాసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే పేద కుటుంబాలకు, దళిత కుటుంబాలకు, అన్ని వర్గాల ప్రజానీకానికి తగిన న్యాయం జరిగిందని వెల్లడించారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పిటిసి, పిసిసి మెంబర్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షుడు బసవయ్య గౌడ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బొజ్జ చంద్రమౌళి, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, యూత్ కాంగ్రెస్ మానకొండ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఇసాముద్దీన్, నాయకులు ఉప్పుగల మల్లారెడ్డి, తిరుపతి, సదానందం, ప్రశాంత్, ప్రవీణ్, లింబాద్రి, తదితరులు పాల్గొన్నారు
ధరణి పోర్టులతో దొరలకే పట్టం కట్టిన టిఆర్ఎస్ ప్రభుత్వం.




