Wednesday, 4 November 2026

ధరణి సంబంధించి పెండింగ్లో ఉన్న వాటిని రెండు రోజుల్లో పూర్తి చేయాలి -జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

గద్వాల నడిగడ్డ ,మార్చి 4 (జనం సాక్షి);
ధరణి కి సంబంధించి టీఎం 33, జిఎల్ఎం, సక్శేష న్ , మిస్సింగ్ సర్వేల కు సంబంధించి గత సంవత్సరం డిసెంబర్ నెల వరకు పెండింగ్లో ఉన్న వాటిని రెండు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.
శనివారం కలెక్టరేట్ సమావేశం హాల్ నందు అన్ని మండలాల తాసిల్దార్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ధరణి సమస్యలను పరిష్కరించేందుకు తహసిల్దార్లు చర్యలు తీసుకోవాలని , అయిజ , కేటి దొడ్డి గట్టు మండలాలలో పెండింగ్ ఉన్న వాటిని రెండు రోజుల్లో పూర్తి చేయాలనీ, పట్టే దారు పాస్ పుస్తకాలూ తప్పులు లేకుండా చెక్ చేసి పంపిణి జరగాలని అన్నారు. మండలాల వారిగా ఎస్సీ స్కాలర్షిప్ కు సంబంధించి ఎన్ని సర్టిఫికెట్లు జారి చేసారని అడిగి తెలుసుకున్నారు. ఎస్సి విద్యార్థులకు మీ సేవ లో దరకాస్తు చేసుకొనుటకు అయ్యే కర్చు ఇస్తామని, మార్చి 31 చివరి తేదీ వరకు ఎస్సీ స్కాలర్షిప్ కు సంబంధించి కులం, ఆదాయం సర్టిఫికేట్ లను మీ సేవ వారితో మాట్లాడి సర్తిపికెట్లు ఇప్పించాలని తహసిల్దార్లకు ఆదేశించారు. ఎస్సీ స్కాలర్షిప్ సంబంధించి అలంపూర్ 86, గద్వాల 300 , ఇటిక్యాల 153 దరఖాస్తులు వచ్చాయని తహసిల్దారులు తెలుపగా ,స్కాలర్షిప్ కు సంబంధించి సర్టిఫికెట్లు రాని వాళ్లకు ఒక వారం లో మీసేవ వాళ్ళతో మాట్లాడి సర్టిఫికేట్ విద్యార్థులకు ఇప్పించాలని అన్నారు. ప్రేమేట్రిక్ స్కాలర్షిప్ కోసం 5 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు మికిచ్చిన అప్లికేషన్లు లో కులం , ఆదాయం సర్టిఫికేట్ లేని వారికీ మీసేవ లో త్వరగా ఇచ్చే విధంగా చూడాలన్నారు.
ఈ సమావేశంలో అన్ని మండలాల తహసిల్దార్లు , తదితరులు పాల్గొన్నారు.