Wednesday, 4 November 2026

సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే 

మోత్కూరు మార్చి 4 జనంసాక్షి : మున్సిపాలిటీ కేంద్రంలోని 12వార్డు జంగాల కాలనీలో సీ.సీ. రోడ్డు నిర్మాణానికి తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ రూ.5లక్షలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా తిరుమలగిరిలోని ఎమ్మెల్యే గారి నివాసం లో 12వార్డు కౌన్సిలర్ కుమారస్వామి, బిఆర్ఎస్ నాయకులు బాలెంల మధు,ఊర సారయ్య మార్యాదపూర్వకంగా కలిసి జంగాల కాలనీలో సీ.సీ. రోడ్డు కోరగా స్పందించి వెంటనే మంజురు చేయడంతో కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా గాంధీనగర్ లో ప్రజలకు మంచినీరు అందించేందుకు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ సూచనతో 12వ వార్డు కౌన్సిలర్ కూరెళ్ల కుమారస్వామి ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. రూ.2 లక్షల వ్యయంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి త్వరలోనే ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించి కాలనీవాసులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే కిషోర్ కుమార్ సహకారంతో గాంధీనగర్ కాలనీ అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. ఆయన వెంట నాయకులు మోత్కూర్ మున్సిపాలిటీ యూత్ ఉపాధ్యక్షులు కూరెళ్ల ఇంద్రశేఖర్,ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కూరెళ్ల రమేష్, 12 వవార్డ్ అధ్యక్షులు కూరెళ్ల సైదులు, కార్మిక విభాగం మున్సిపల్ ఉపాధ్యక్షులు కూరెళ్ల నాగరాజు,12 వార్డ్ యూత్ అధ్యక్షులు వడ్డేపల్లి నగేష్, బందెల శ్రీను, కూరెళ్ల యాదగిరి, చెడిపల్లి ఆనంద్, సూరారం నర్సింహా ఉన్నారు.