కొత్తగూడ ఏప్రిల్ 18 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఇండియన్ బ్యాంక్ మేనేజర్ బాల జ్యోతి మాట్లాడుతూ ఎస్టి కార్పొరేషన్ సబ్సిడీ ఎంపిక చేయు విధానంలో బ్యాంకు మార్గదర్శకాల మేరకు బ్యాంకు సిబ్బంది వ్యవహరించడం జరుగుతుంది.ప్రస్తుత మార్గదర్శకాల ప్రకాశం బ్యాంకుల నుండి ఎలాంటి ఋణాలు లబ్ధిదారులు పొందాలన్న తప్పనిసరిగా సిబిల్ స్కోర్ కచ్చితంగా ఉండాల్సిందే…పాత ఋణాలను సక్రమంగా చెల్లించవలసి ఉంటుంది.ఈ మార్గదర్శకాలను పాటించని లబ్ధిదారుల ను బ్యాంకు జోనల్ ఆఫీస్ కరీంనగర్ వారి అంగీకారంతో తిరస్కరించడం జరిగింది.బ్యాంకు సిబ్బంది ఖాతాదారుల పట్ల,లబ్ధిదారుల పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు నవీన్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం,బ్యాంకు ఖాతాదారులతో బ్యాంకు సిబ్బంది స్నేహపూర్వకంగా వ్యవహరించడం జరుగుతుంది.బ్యాంకు ప్రతిష్టకు భంగం కలిగేలా వార్తలు సృష్టించిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలియ చేయడం జరిగింది.




