తాను, తన కుమారుడు హితేష్ రాజకీయాలకు స్వస్తి చెబుతున్నామని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రకటించారు.
బాపట్ల జిల్లా ఇంకొల్లులో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాల వేదికపై ఈ ప్రకటన చేశారు. ఆయన ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంకొల్లుతో తనకున్న అనుబంధంతో ఇక్కడ తన మనసులోని మాట చెప్పానని వివరించారు. డబ్బుతో రాజకీయం, కక్ష సాధింపులకు దిగటం తమ కుటుంబానికి అలవాటు లేదని, గతంలో రాజకీయాలకు, నేటికీ పొంతన లేదని.. అందుకే హితేష్, తానూ రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగుతున్నామని వెల్లడించారు.




