Wednesday, 4 November 2026

నిరుపేదల ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్

నిరుపేదల ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్

సర్పంచ్ దుంపల జమున సమ్మయ్య

పెద్దవంగర నవంబర్ 22(జనం సాక్షి )
నిరుపేదల పాలిట సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడుగా నిలిచారని సర్పంచ్ దుంపల జమున సమ్మయ్య అన్నారు. మంగళవారం మండల ఉప్పరగూడెం గ్రామంలోని లబ్ధిదారులు రాసాల సోమల్లుకు,వేముల రంజిత్ కుమార్ కు మొత్తం 80,000 వేలు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరైన చెక్కులను స్థానిక సర్పంచ్ దుంపల జమున సమ్మయ్య,అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.పేదరికంలో ఉండి,అనారోగ్యం బారిన పడిన క్రమంలో వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఉన్న నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయుక్తంగా మారిందని,కరోనా కారణంగా తీవ్ర ఆర్థికమాంద్యం ఏర్పడినప్పటికీ సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాల అమలులో వెనుకడుగు వేయలేదని,రాజకీయాలకు అతీతంగా రాష్ర్టంలో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.ఎవరైనా అనారోగ్యం బారిన పడిన నిరుపేద కుటుంబాలు ఉన్నట్లయితే సీఎం రిలీఫ్ ఫండ్స్ కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు నీలం సోమయ్య,మాజీ సర్పంచ్ పాశం ఉప్పలయ్య,వార్డు సభ్యులు పాశం పరశురాములు,పెద్ది లక్ష్మయ్య, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు