Thursday, 5 November 2026

ధర్మపురి పట్టణ కేంద్రంలోని క్రికెట్ పోటీలను ప్రారంభించిన మంత్రి కొప్పుల

ధర్మపురి పట్టణ కేంద్రంలోని క్రికెట్ పోటీలను ప్రారంభించిన మంత్రి కొప్పుల..

ధర్మపురి (జనం సాక్షి) పట్టణ కేంద్రంలో ధర్మపురి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రోలింగ్ క్రికెట్ కప్ పోటీలను ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ పోటీల్లో 152 జట్లు క్రికెట్ ఆడనున్నాయి.ఈ క్రికెట్ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచిన జుట్టుకు 60 వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన జుట్టుకు 30 వేల రూ. నగదు బహుమతులు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్152 జట్లకు ఎల్.యం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా క్రీడాకారులకు టీ షర్ట్ లను మంత్రి అందించారు..
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఈ రోలింగ్ కప్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు..
ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు క్రీడా స్ఫూర్తి తో గెలుపు ఓటములకు అతీతంగా ముందుకు సాగాలని మంత్రి సూచించారు..
అనంతరం జాతీయ గీతంతో ఈ పోటీలను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు, గురువారం ప్రారంభ మ్యాచ్ లో సిరికొండ, దమ్మన్నపేట గ్రామాల జట్లు తలపడనున్నాయి.ఈ టోర్నమెంట్ పాల్గొంటున్న జట్టులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో యంపి బోర్లకుంట వెంకటేష్ నేత,జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్,డిసిఎంఎస్ ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి,మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తెమ్మ ,జెడ్పీటీసీలు బత్తిని అరుణ,బాదినేని రాజేందర్, యంపిపి లు చిట్టి బాబు, సౌల్ల భీమన్న, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సునీల్,మున్సిపల్ వైస్ చైర్మన్ రామన్న మరియు సర్పంచులు అధికారులు పాల్గొన్నారు.