Wednesday, 4 November 2026

ధర్మపురి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆటల పోటీలు

ధర్మపురి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆటల పోటీలు

 

క్రీడాకారులు క్రీడ స్ఫూర్తిని ప్రదర్శించాలి -ఎస్సై కిరణ్ కుమార్..

ధర్మపురి (జనం సాక్షి ) ధర్మపురి పట్టణంలో మంగళవారం ఉదయం జడ్పీ హెచ్ ఎస్ హైస్కూల్ విద్యార్థుల్లో మంచి స్ఫూర్తిని నింపుతూ వారికి మనోధైర్యం తెలుపుతూ, మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు, జనవరి 12వ తేదీ రోజున వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పాఠశాల స్థాయిలోని విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నాము అని ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మరల మండల స్థాయిలో ఆటలు పోటీలు నిర్వహించబడును అని విద్యార్థులకు వారు తెలుపుతూ, పలు క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని ధర్మపురి సబ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి లో,బాలబాలికల కబడ్డీ పోటీలు జరుగుతున్న, మైదానానికి విచ్చేసిన ఎస్సై కిరణ్ కుమార్, మాట్లాడుతూ ప్రస్తుతం కబడ్డీ క్రీడల్లో భారతదేశం అత్యుత్తమంగా రాణిస్తున్నదన్నారు. జాతీయ కబడ్డీ క్రీడాకారులను ఆదర్శంగా తీసుకొని జిల్లా స్థాయిలో కబడ్డీ క్రీడాకారులు రాణించాలన్నారు.గ్రామీణ ప్రాంతాల్లోని వారికి విశేషమైన క్రీడా ప్రతిభ దాగిఉంటుందని, వారిని తగిన విధంగా ప్రోత్సహిస్తే భారతదేశానికి ఎన్నో పతకాలను సాధించి పెడతారన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడిపోతే కక్ష్యలు పెంచుకోకూడదని, క్రీడాస్ఫూర్తితో ప్రతి ఒక్క క్రీడాకారుడు మెలగాని ఆయన సూచించారు.
అంతేకాకుండా క్రీడల ద్వారా విద్యార్థులలో మానసికోల్లాసం, శరీర ధారుడ్యం పెరుగుతాయని, తద్వారా విద్యలో కూడా విశేషంగా రాణించడానికి ఆస్కారముంటుందని ఆయన కితాబిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం అందిస్తుందన్నారు.
క్రీడల్లో బాగా రాణించి జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన అన్నారు.