సెస్ ఎన్నికలు ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంటది.
ఐటీ ,మున్సిపల్ ,భారీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు.
ప్రధాని మోడీ తీరుపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇప్పటిదాకా ఏం చేశారో చెప్పాలి.
చెప్పిన లెక్క తప్పైతే రాజీనామాకు సిద్ధం.
బిఆర్ఎస్ జైత్రయాత్ర జిల్లా నుంచే ప్రారంభం కావాలి.
జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. జనవరి 10. (జనంసాక్షి) సెస్ ఎన్నికలు ట్రైలర్ మాత్రమేనని రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు బిజెపికి అసలు సినిమా చూపిస్తారని ఐటీ మున్సిపల్ భారీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కేంద్ర లోని బిజెపిని ఉద్దేశించి అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ తంగళ్ళపల్లిలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఆవిష్కరణతో పాటు నూతనంగా నిర్మించిన మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని సహకార విద్యుత్ సంస్థ సెస్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం పద్మనాయక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రైతు కృతజ్ఞత సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ బిజెపి పార్టీ నాయకులు సెస్ ఎన్నికల్లో పైసలు పంచిన బిఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడి విజయాన్ని అందించిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ప్రజలు సెస్ ఎన్నికల ద్వారా ట్రైలర్ మాత్రమే చూపించారని రానున్న ఎన్నికల్లో అసలు సినిమా చూపిస్తారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి 3.68 లక్షల కోట్లు పన్నుల రూపంలో కడితే కేంద్రం 1.68 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందని అన్నారు. ఒకవేళ తాను చెప్పిన లెక్కల్లో తప్పు ఉంటే రాజీనామాకు సిద్ధమని బిజెపి నేతలకు సవాల్ విసిరారు. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ నాలుగేళ్లలో ఏం చేశాడో ప్రజలకు చెప్పాలని అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలైన కర్ణాటక మహారాష్ట్ర మధ్య వివాదాన్ని పరిష్కరించలేని ప్రధాని మోడీ రష్యా ఉక్రెన్ యుద్ధాన్ని ఆపాడాని చెప్పుకోవడం హాస్యస్పదమని అన్నారు. 65 ఏళ్లలో 14 మంది ప్రధాన మంత్రులు పనిచేసిన చేనేత పై పన్నువేసిన ఏకైక ప్రధాని మోడీ మాత్రమేనని ఎద్దేవా చేశారు. మోడీ చేసిన అప్పులు అంబానీ, ఆధానిల జేబుల్లోకి వెళ్తున్నాయని ఇద్దరికోసమే మోడీ పనిచేస్తున్న వాస్తవాలను యువత గమనించాలని కోరారు. కెసిఆర్ నాయకత్వంలో జిల్లాకు మెడికల్ కాలేజీ ఇవ్వడంతో పాటు సంక్షేమ పథకాలతో దేశంలోని ఆదర్శంగా నిలిచామని స్పష్టం చేశారు. మోడీ ఎట్లా దేవుడైతడని 400 అన్న సిలిండర్ 11 వందలకు పెంచినందుకా, 70 రూపాయలకు లీటరు ఉన్న పెట్రోలు 120 చేసినందుకా అడ్డగోలుగా ధరలు పెంచుతున్నందుకు దేవుడైతుడా ఆలోచించాలని ప్రజలను కోరారు. ఢిల్లీలోని బిజెపి ప్రభుత్వం అవార్డులు ఇస్తుంటే గల్లీలో బిజెపి నాయకులు గాలి మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు . 65 ఏళ్లలో కానీ అభివృద్ధిని ఎనిమిది ఏళ్లలో చేసి సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాడని స్పష్టం చేశాడు. తన ప్రసంగంలో బిజెపి నాయకుల తీరును తీవ్రంగా ఎండగట్టారు. సిరిసిల్ల నుండి బిఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం కావాలని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణ, ఎమ్మెల్సీ రమణ, శాసనసభ్యులు రసమయి బాలకిషన్ ,సుంకే రవిశంకర్ , టేస్కబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, తెలంగాణ పవర్లు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూర్ ప్రవీణ్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, తదితరులు పాల్గొన్నారు.




