Thursday, 5 November 2026

ధర్మపురి మండలంలోని వరి ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో సోమవారం రోజున ధర్మపురి తహసిల్దార్ గారికి జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (మాజి జెడ్పీ చైర్మన్) గారి ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది

 

 

 

 

 

 

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసి ప్రభుత్వం ఎప్పుడు కొనుగోలు చేస్తుందో అని రైతులు ఎదురుచూడటం జరుగుతుందని ఈ సంవత్సరం రైతులు పెట్టిన పెట్టుబడితో పోల్చుకుంటే దిగుబడి తక్కువగా వచ్చిందని,తేమ శాతం రాగానే వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చెయ్యాలని ప్రభుత్వం చెప్తుంటే కొనుగోలు సెంటర్ల వద్ద మాత్రం తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని,కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు వడ్ల మీద కప్పడాని కనీసం కవర్లు కూడా ఇవ్వడం లేదని,కాంగ్రెస్ పార్టీ హయాంలో ధాన్యం కొనుగోలు మొదలు పెట్టె కంటే ముందే సంబంధిత మంత్రి జిల్లా కలెక్టర్,వ్యవసాయ అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసేవారని,రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా హమాలీ ఖర్చు కూడా ప్రభుత్వమే భరించేదని, కాని ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల పైన జిల్లా అధికారుల పర్యవేక్షణ లేక నేరుగా మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారని,దీని మీద చాలా సార్లు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికి ఇప్పటి వరకు సరైన స్పందన లేదని,మిల్లర్ల పైన కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదని, రైతులు ద్వారా నేరుగా అధికారులను కలవాలని అనుకుంటే పోలీస్ యాక్ట్ అని తీసుకురావడం జరిగిందని,ఇప్పటికైనా మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు స్పందించి వెంటనే మిల్లర్లను కట్టడి చేసి,తేమ శాతం పేరిట రైతులను ఇబ్బందులకు గురిచేయ్యకుండ ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రెండు రోజుల్లోగా సమస్య పరిష్కారం కాకపోతే మా కార్యాచరణ ప్రకటిస్తామని,మా మీద ఎన్ని కేసులు పెట్టిన సిద్దంగా ఉన్నామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు…

ఈ కార్యక్రమంలో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు…