హైదరాబాద్,(జనంసాక్షి): జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలెదుర్కొంటున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యవహారంపై సుప్రీం కోర్టుకు వెళ్లాలని సీబీఐ అధికారులు నిర్ణయించారు. కాగా ధర్మాన అభియోగాలను విచారణకు స్వీకరించాలని సీబీఐ దాఖలు చేసిన మెమోపై విచారణను సీబీఐ కోర్టు జులై 18 కి వాయిదా వేసింది.




