హైదరాబాద్ : మద్యం అమ్మకాలపై ఎలాంటి టార్గెట్లు విధించడం లేదని మంత్రి పార్థసారథి తెలిపారు. ప్రతి జిల్లాలోను డి అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని, జిల్లా వైద్యాధికారుల పర్యవేక్షణలో అవి పనిచేస్తాయని ఆయన తెలిపారు. పాత లైసెన్సుదారులకే రెన్యువల్స్ చేశామన్నారు. మద్యం షాపుల ముందే తాగడం వల్లే చుట్టుపక్కల నివాసముంటున్న వారికి ఇబ్బందులు కలుగుతున్నాయని ఫిర్యాదులు రావడం వల్లే అన్ని మద్యం షాపులకు పర్మిట్ రూంలకు అవకాశమిచ్చామన్నారు. పర్మిట్ రూంలలో సిట్టింగ్ ఏర్పాట్లు, తినుబండారాల అమ్మకాలు చేయకూడదని చెప్పారు.




