హైదరాబాద్: ధర్మాన, మోపిదేవి వ్యవహారాలు వేర్వేరని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మోపిదేవిని సీబీఐ అరెస్టు చేసిందని, ధర్మానపై విచారణకు తమ అనుమతి కోరిందని సీఎం మీడియాతో మాట్లాడుతూన్నారు. మంత్రివర్గ నిర్ణయాన్ని ధర్మాన ఆమోదించనందునే ఆయన వ్యవహారంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలియజేశారు. విద్యుత్ సర్‌ఛార్జీలు ఎందుకు పెరుగుతున్నాయో ప్రజలకు మీడియా అవగాహన కల్పించాలని ఓ ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి చెప్పారు. విద్యుత్ ఛార్జీలు తగ్గాలంటే ప్రజలు వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు.




