Monday, 2 November 2026

ధర్మాన, సబిత కస్టడీపై విచారణ 25కి వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): మాజీమంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబిత ఇంద్రారెడ్డి బుధవారం సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. సీబీఐ కోర్టుకు సమర్పించిన సీడీ అస్పష్టంగా ఉందని, ఒరిజినల్‌ సీడీలను దాఖలు చేయాలని సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని వారు తమ మెమోలో కోరారు. ఒరిజినల్‌ సీడీ సమర్పించాకే జ్యుడిషియల్‌ కస్టడీ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేస్తామని ధర్మాన, సబిత మెమోలో కోర్టుకు తెలిపారు. ఈ కేసుపై విచారణను కోర్టు ఈనెల 25 వతేదీకి వాయిదా వేసింది. మరోవైపు ధర్మాన, సబిత జ్యుడిషియల్‌ కస్టడీపై తదుపరి విచారణ 25కు వాయిదా పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *