– బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకునేందుకు కార్పొరేట్ సంస్థల ఆసక్తి
న్యూఢిల్లీ : శిఖర్ ధావన్ ఇప్పుడు కార్పొరేట్ సంస్థలను ఆకట్టుకోవాడంలో అందరి కంటే ముందున్నాడు. వరుసగా మూడు అంతర్జాతీయ సెంచరీలను నమోదు చేసిన 27 ఏళ్ల ధావన్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకోవాలని సంస్థలు పోటిపడుతున్నాయి. అతి త్వరలోనే ఈ బ్యాటింగ్ ఐకాన్ వాణిజ్య ప్రకటనలు, అండర్స్‌మెంట్స్‌లో ఇతర క్రికెటర్లను అధిగమించడం ఖాయమని కార్పోరేటర్ వర్గాలు సృష్టం చేస్తున్నాయి. ధావన్ తనకు లభించిన ప్రతి ఆవకాశాన్నీ అద్భుతంగా వినిమూగించుకుంటూ ముందుకు వెళుతున్నాడని, అతని ప్రతిభాపాటవాలకు దేశ ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని కార్నర్ స్టోన్ స్పోర్ట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బంటి సజ్దే పిటిఐతో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు.అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంబించినప్పటి నుంచి ధావన్ విజృంభణ కొనసాగుతున్నదని పేర్కొన్నాడు.అతని బ్రాండ్ వాల్యూక్రమంగా పెరుగుతుందని ఎవరికి అందనంత ఎత్తుకు ఎదగడం ఖాయమని పేర్కొన్నాడు.మొహాలీలో ఆస్ట్రేలియాపై టెస్ట్ కెరీర్‌ను ప్రారంమించిన ధావన్ తొలి టెస్టులోనే అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఓపెనర్‌గా రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే.చాపింయన్స్ ట్రోఫిలో వరుస సెంచరీలు అతని ప్రతిష్టను మరింత పెంచాయి. ఇదే విషయాన్ని సజ్దే ప్రస్తావిస్తూ, తాము ఇప్పటికే కొన్ని కంపెనీలతోచర్చిస్తున్నట్లు చెప్పాడు. కనీసం మూడు నాలుగు బహుళజాతి సంస్థలు ధావన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్దంగ ఉన్నాయని చెప్పాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ కార్నర్‌స్టోన్ సంస్థ ద్వారానే వివిధ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఉన్నారని, తాజాగా ధావన్‌కూ తామే ఈ రంగంలో దిశా నిర్దేశనం చేస్తామని వివరించిడు. నాణ్యాతా ప్రమాణాలకు అత్యదిక ప్రాధాన్యం ఇస్తామని, కాబట్టి ధావన్‌కు రాసిలో ఎక్కువ కంపెనీలు ఉండటంకంటే, అత్యుత్తమ స్థాయి కంపెనీలనే ఎంపిక చేస్తామని సజ్దే తెలిపాడు. ధావన్‌కు పెరుగుతున్న క్రేజీ అతని వ్యాఖ్యలు చెప్పకనే చెప్తున్నాయి. మీసాలను పెచడంలో, వాటిని అందంగా తీర్చిదిద్దుకోవడంలో ధావన్‌ను అంతా ఆస్ట్రేలియా మాజీ పేసర్ మెర్వ్ హ్యూజెస్‌తో పోలుస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో హ్యూజెస్ అసాధారణ బౌలర్‌గా గుర్తింపు సంపాదించలేకపోయినా, గుబురు మీపాలతో ప్రత్యేకలను చాటుకున్నాడు. ధావన్ కూడా అతని దారిలోనే నడుస్తున్నాడు.




