శంకరపట్నం: జనం సాక్షి జూన్ 1
కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గ శంకరా పట్నం మండలం ధర్మారం గ్రామంలో గ్రామదేవతలైన భూలక్ష్మి మహాలక్ష్మి, బొడ్రాయి ప్రతిష్టాపన కోసం గురువారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించినట్లు ఆ గ్రామ సర్పంచ్ చుక్కల రవి తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ రవి మాట్లాడుతూ గ్రామ పంచాయితీ కూడలి వద్ద గ్రామదేవతలను ప్రతిష్టించడం జరుగుతుందని ప్రతిష్టాపన కోసం గ్రామదేవతల విగ్రహాల ప్రతిష్ట కోసం భూమి పూజ కార్యక్రమాన్ని వేద పండితుల మంత్రోత్సవాల నడుమ నిర్వహించి, ఆహ్వాన పత్రాలను ఆవిష్కరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
ధర్మారంలో భూమి పూజ..




