Sunday, 8 November 2026

పోలీస్ అభ్యర్థులు సాధన చేసి ఉద్యోగాలు సాధించాలి

పోలీస్ అభ్యర్థులు సాధన చేసి ఉద్యోగాలు సాధించాలి హుజూర్ నగర్ నవంబర్ 24 (జనంసాక్షి): పోలీస్ ఉద్యోగాల భర్తీలో అభ్యర్థులు ఈవెంట్స్ కలిసికట్టుగా సాధన చేసి ఉద్యోగాలు సాధించాలని హుజూర్ నగర్ గ్రంథాలయ చైర్మన్ పిన్నని సంపత్ కుమార్ (దళపతి) అన్నారు. గురువారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సై , కానిస్టేబుళ్ల స్థాయి పోస్టుల శారీరక సామర్ధ్య పరీక్షల కోసం సిద్ధమవుతున్న వారి కోసం లాంగ్ జంప్ ట్రాక్ 2 ట్రాక్టర్ ఇసుక, 2 షాట్ పుట్లను రూ.10వేల తో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని పోలీస్ అభ్యర్థులందరూ వినియోగించుకోవచ్చునని తెలిపారు.